లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ

Tuesday,February 06,2018 - 02:58 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ హీరోగా వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్’ ఈ నెల 9 న గ్రాండ్ గా రిలీజవుతుంది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది లావణ్య త్రిపాఠి. ఆ చిట్ చాట్ మీకోసం…

అదే నా క్యారెక్టర్…

ఈ సినిమాలో నా పేరు సంధ్య… హీరో బాస్ కూతురిగా నటిస్తున్నాను. ఫాదర్ కి బిజినెస్ లో హెల్ప్ చేస్తుంటాను. U.S. రిటర్న్ కాబట్టి కొంచెం కోపంగా, డామినేటింగ్ ఆటిట్యూడ్ ఉంటుంది.

 

నేను ఇంటిలిజెంట్ కాదు….

సినిమాలో నా రోల్ ఇంటెలిజెంట్ కాదు, హీరో రోల్ ఇంటెలిజెంట్. ఒక ప్రాబ్లమ్ ని ఎంత ఇంటెలిజెంట్ ని సాల్వ్ చేస్తాడు కాబట్టే సినిమాకి ఇంటెలిజెంట్ అనే టైటిల్ పెట్టారు.

కొత్తగా ఉంటుంది….

నా కరియర్ లో ఇప్పటి వరకు ఇలాంటి పెద్ద కమర్షియల్ సినిమాలో నటించలేదు.

మా రిలేషన్ షిప్…

సినిమాలో నాకు హీరోకు మధ్య ఉండే రిలేషన్ షిప్ చాలా క్యూట్ గా ఉంటుంది. బిగినింగ్ లో కోపంగా, గొడవలు పడుతూ ఆ తరవాత ఇంట్రెస్టింగ్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుంది.

జస్ట్ ఎంజాయ్ చేశాం…

నాకు చమక్ చమక్ సాంగ్ గురించి చెప్పినప్పుడు ఆల్మోస్ట్ హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయింది. లెజెండ్రీ యాక్టర్స్ పర్ఫామ్ చేసిన సాంగ్ చేయడమంటే అది చిన్న విషయం కాదు. వాళ్ళను మ్యాచ్ అవ్వడమన్నది ఇంపాసిబుల్. అందుకే ఆ సాంగ్ ని జస్ట్ ఎంజాయ్ చేశాం అంతే…

 

నాతో భయపడతారు….

ఈ  సినిమాలోలాగా నన్నెవరూ ప్రపోజ్ చేయలేదు. ఒక రకంగా నాతో అలాంటివి మాట్లాడాలంటే భయపడతారు. నేను పని గురించి తప్ప ఇంకేం మాట్లాడను.

డైరెక్టర్ వినాయక్ గారు….

వినాయక్ గారు ఎంత  పెద్ద డైరెక్టరో నాకు తెలుసు. కానీ అంత డౌన్ టు అర్త్ ఉంటారనే విషయం ఆయనతో పని చేశాకే తెల్సింది. ప్రతీది ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తుంటారు. ఆయన చేసే పని విషయంలో చాలా క్లారిటీతో ఉంటారు.

నేను – తేజు సేమ్ టు సేమ్

సినిమాకి ముందు నాకు తేజుకి పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. కానీ ఎప్పుడైతే షూటింగ్ కి మస్కట్ వెళ్ళామో, ఇద్దరం క్లోజ్ అయిపోయాం. మా ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాం. అందుకే మా ఇదరి కెమిస్ట్రీ స్క్రీన్ పై చాలా బాగా వర్కవుట్ అయింది.

ఫీడ్ బ్యాక్ మ్యాటర్స్…

చేసిన ప్రతి సినిమాకి ఫీడ్ బ్యాక్ కంపల్సరీ. డిస్కస్ నేను కూడా చేస్తాను కానీ, అన్ని ఫీడ్ బ్యాక్స్ ని తీసుకోలేం. ఎందుకంటే కొందరికి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్స్ నచ్చుతాయి. కొందరికి ఆర్టిస్టిక్ మూవీస్ నచ్చుతాయి. టేస్ట్ ని బట్టి ఫీడ్ బ్యాక్ ఉంటుంది ఒక్కోసారి…

 

రిగ్రెట్స్ ఏమీ లేవు…

డిఫెరెంట్ రోల్స్ చేయాలి, అందునా మనకు సూట్ అయ్యే రోల్స్ చేయాలి. నా కరియర్ బిగిన్ అయినప్పటి నుండి మ్యాగ్జిమం అలాంటి రోల్సే చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన ఏ రోల్ విషయంలోనూ రిగ్రెట్స్ లేవు.

ఫెయిల్యూర్ ప్రభావం….

సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా పెద్దగా తేడా ఏం ఉండదు. సక్సెస్ నెత్తికి ఎక్కదు అలాగే ఫెయిల్యూర్ వస్తే డఫ్ఫినేట్ గా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలా అనే యాంగిల్ లో ఆలోచిస్తా….

హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నాను…

ముంబై లో నాకు ఇల్లు ఉంది కానీ, ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నాను.

డిఫెరెంట్ రోల్స్ చేయాలి….

ఇండస్ట్రీలో హీరోలతో కంపేర్ చేస్తే హీరోయిన్స్ కి అంతలా చూజ్ చేసుకునే రేంజ్ లో అవకాశాలు ఉండవు. నాకు చాలా డిఫెరెంట్ రోల్ చేయాలని ఉంది. కమర్షియల్ మూవీస్ చేస్తున్నాను కాబట్టి డిఫెరెంట్ రోల్స్ చేయను అని కాదు, పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న ఎలాంటి రోల్స్ అయినా చేయడానికి నేను రెడీ.

అందుకే మలయాళ సినిమాలు…

తక్కిన లాంగ్వేజెస్ తో కంపేర్ చేస్తే మలయాళం లో డిఫెరెంట్ చేస్తుంటారు. క్యారెక్టర్స్ కూడా అంతే రియలిస్టిక్ గా ఉంటాయి. అందుకే మళయాళ సినిమాలు కూడా చేయాలనుకుంటున్నాను.