లావణ్య లెక్క తప్పినట్టే...

Thursday,March 28,2019 - 03:40 by Z_CLU

లావణ్య త్రిపాఠి అప్ కమింగ్ సినిమాలేంటి…? ఇంటర్నెట్ లో వెదికినా ప్రస్తుతానికి రిలీజ్ కి రెడీ అవుతున్న ‘అర్జున్ సురవరం’ తప్ప ఇంకోటి తగలదు. అలాగని ఇతర భాష సినిమాల్లో ఏమైనా ప్రయత్నిస్తుందా అంటే ఆ దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేం కానీ ఎక్కడో లావణ్య లెక్క తప్పిందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది.

సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన ‘ఇంటిలిజెంట్’ లెక్క తప్పడం, దాని ఎఫెక్ట్ తో ‘అంతరిక్షం’ లో నిడివి తగ్గడంతో న్యాచురల్ గానే లావణ్య షైన్ తగ్గింది. ఏడేళ్ళ సినిమా కరియర్ లో ఇప్పటికీ స్ట్రగుల్ స్టేజ్ లో ఉందంటే లావణ్య కరియర్ ని ఇంకో ఆంగిల్ లో ప్లాన్ చేసుకోవాల్సి ఉండేదేమో..

మొన్నా మధ్య వరసగా ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లాంటి సినిమాలు పడేసరికి ఇక లావణ్య ట్రాక్ లో పడింది అనిపించింది. కానీ ఆ తరవాత వరసగా అసలెందుకు ఈ సినిమా ఎంచుకుంది అంటే టక్కన సమాధానం కూడా తట్టకుండా చేసింది.

ఏది ఏమైనా లావణ్య ఫ్యూచర్ కరియర్ మాత్రం డెఫ్ఫినెట్ గా ‘అర్జున్ సురవరం’ సక్సెస్ పైనే డిపెండ్ అయి ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే, లావణ్యకి ఇంకొన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కానీ అలా జరగకపోతేనే..? చూడాలి, మరి లావణ్య ఏం అనుకుంటుందో…