లావణ్య త్రిపాఠి బర్త్ డే స్పెషల్

Friday,December 15,2017 - 02:38 by Z_CLU

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయింది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో ‘మిథున’ గా అందరి హాట్ ఫేవరేట్ గా మారిన ఈ ముద్దుగుమ్మ ఈ రోజు తన 27 వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటుంది.

2006 లో మిస్ ఉత్తరాఖండ్ గా టైటిల్ గెలుచుకున్న లావణ్య ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ కి ధీటుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది.  ‘అందాలరాక్షసి’ సినిమా తర్వాత ఇమ్మీడియట్ గా రిలీజైన ‘దూసుకెళ్తా’ సినిమాతో కమర్షియల్ హీరోయిన్ గా ఇంప్రెస్ చేసిన లావణ్య ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో కంప్లీట్ లైమ్ లైట్ లోకి వచ్చేసింది.

 

చూజీగా సినిమాల్ని ఎంచుకుంటూ కరియర్ ని సక్సెస్ ఫుల్ గా ప్లాన్ చేసుకుంటున్న లావణ్య, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జున సరసన నటించే చాన్స్ కొట్టేయడంతో స్టార్ హీరోయిన్స్ రేంజ్ కి ఎదిగింది.

ఆలు శిరీష్ సరసన ‘శ్రీరస్తు శుభమస్తు’, ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన మిస్టర్, శర్వానంద్ ‘రాధ’ సినిమాల్లో హీరోయన్ గా నటించిన లావణ్య, తను చేసే ప్రతి క్యారెక్టర్ లోను ఏదో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడటం, ఎప్పటికప్పుడూ తనను తాను అప్ డేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడం లావణ్యని సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లిస్టులోకి చేర్చింది.

రీసెంట్ గా రామ్ సరసన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో నటించిన లావణ్య తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ సినిమాల్లోను తన లక్ ని చెక్ చేసుకుంటున్న లావణ్య మరెన్నో హైట్స్ కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ, బర్త్  డే  విషెస్  అందజేస్తుంది  జీ  సినిమాలు.