ఈ సారి అలా కనిపించబోతున్నాను -లావణ్య

Monday,July 25,2016 - 11:29 by Z_CLU

అందాల రాక్షసి చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయమై తొలి చిత్రం తోనే పరిశ్రమలో ప్రశంసలతో పాటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న కథానాయిక లావణ్య త్రిపాఠి తను ప్రస్తుతం నటిస్తున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ లో సరి కొత్తగా ట్రెండీ లుక్ లో కనిపించనున్నట్లు తెలిపారు. ఇక  ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం లో డాన్స్ టీచర్  గా కనిపించి ఆకట్టుకున్న లావణ్య ఇటీవలే  ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం లో  నాగార్జున కు భార్య గా గృహిణి పాత్రలో కనిపించి మరో సారి ఆకట్టుకొని రెండు విజయాలు సొంతం చేసుకుంది. అయితే తాజాగా లావణ్య అల్లు శిరీష్ సరసన నటిస్తున్న ‘శ్రీ రస్తు శుభమస్తు’లో ఓ కాలేజ్ అమ్మాయి లా  ఓ ట్రెండీ లుక్ లో కనిపించనుందట. ఇప్పటికే  తన లుక్ గురించి అభినందనలు అందుకుంటోందట. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా తన కు కథానాయికగా మంచి గుర్తింపు తీసుకు రానుందని అలాగే చిత్రం ఖచ్చితంగా అందరినీ అలరించి  మంచి విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు..