కన్నడ సినిమాపై క్లారిటీ ఇచ్చింది

Saturday,June 24,2017 - 04:35 by Z_CLU

ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలతో, క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది లావణ్య త్రిపాఠి. ఇలాంటి స్టేజ్ లో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లాలని ఎవరూ అనుకోరు. కానీ లావణ్య మాత్రం కన్నడలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ 3 రోజులుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ పుకార్లను లావణ్య ఖండించింది.

కన్నడలో కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కలిసి ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. దాని పేరు ది విలన్. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఎమీ జాక్సన్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్టు రూమర్లు వచ్చాయి. స్టార్టింగ్ లో వీటిని లైట్ తీసుకున్న లావణ్య.. రూమర్లు మరింత ఎక్కువవ్వడంతో క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతానికి కన్నడ సినిమాల్లో నటించే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేసింది లావణ్య త్రిపాఠి. తెలుగులో నాగచైతన్య సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. కృష్ణ మరిముత్తు దీనికి దర్శకుడు.