జై లవకుశలో లవకుమార్ లుక్ రిలీజ్

Monday,August 07,2017 - 11:01 by Z_CLU

జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ 3 గెటప్స్ లో కనిపిస్తాడనే విషయం తెలిసిందే. ఇందులో జై క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ తో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు లవ కుమార్ పాత్రకు చెందిన లుక్ ను రిలీజ్ చేశారు. జై క్యారెక్టర్ లో నెగెటివ్ షేడ్స్ లో కనిపించిన యంగ్ టైగర్.. లవకుమార్ పాత్రలో మోస్ట్ స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. పాత్రకు తగ్గట్టు లవర్ బాయ్ లా, క్యూట్ గా ఉన్న ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేశారు.

నిజానికి లవకుమార్ లుక్ రిలీజ్ లో భాగంగా సింగిల్ పోస్టర్ ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఫైనల్ గా సెలక్ట్ చేసిన రెండు లుక్స్ లో దేన్ని రిలీజ్ చేయాలో తేల్చుకోలేకపోయారు. అందుకే లవకుమార్ పాత్రకు చెందిన ఓ పోస్టర్ ను ఎన్టీఆర్ రిలీజ్ చేస్తే.. 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మరో పోస్టర్ ను కల్యాణ్ రామ్ విడుదల చేశారు. ఈ రెండు పోస్టర్లు అదిరిపోయాయి.

బాబి దర్శకత్వంలో డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోంది జై లవకుశ సినిమా. త్వరలోనే లవకుమార్ టీజర్ ను కూడా విడుదల చేసి, ఆ తర్వాత కుశాల్ క్యారెక్టర్ ను కూడా రివీల్ చేస్తారు. ఈ సినిమాను వచ్చేనెల 21న విడుదల చేయబోతున్నారు.