Tillu2 అనుపమ ప్లేస్ లో సెబాస్టియన్ ?

Tuesday,November 29,2022 - 02:11 by Z_CLU

Latest Gossip: Anupama Parameswaran out from ‘Tillu2’ ?

ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న చిన్న సినిమాల లిస్టు లో ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ‘డీజే టిల్లు’. ఈ సినిమా రిలీజ్ తర్వాత సిద్దు (Siddu Jonnalagadda) స్టార్ అయిపోయాడు. హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి మంచి క్రేజ్ తెచ్చుకొని వరుస ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం ఇప్పుడు డీజే టిల్లు కి సీక్వెల్ గా Tillu2 రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతుంది.  ఇందులో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. తాజాగా అనుపమ ఈ సినిమా నుండి తప్పుకుందనే గాసిప్ వినబడుతుంది.

అనుపమ స్థానంలో ఇప్పుడు సెబాస్టియన్ మడోన్నా ను హీరోయిన్ గా తీసుకున్నట్లు టాక్ . అయితే మేకర్స్ ఇంతవరకూ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి నిజంగానే అనుపమ ఈ క్రేజీ సీక్వెల్ నుండి తప్పుకుందా ? లేదంటే ఇది జస్ట్ రూమరా ? తెలియాల్సి ఉంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై మల్లిక్ రామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ కానుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics