Acharya గెస్ట్ రోల్ లో అనుష్క ?

Wednesday,April 27,2022 - 10:42 by Z_CLU

Latest Buzz : Anushka Shetty Cameo in Acharya ?

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మెగా మేనియానే కనిపిస్తుంది. సినిమలో రామ్ చరణ్ సిద్ద అనే స్పెషల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు నలబై నిమిషాల నిడివి ఈ పాత్ర సినిమాలో కనిపించనుందని యూనిట్ చెప్తున్నారు.

ఇక ‘ఆచార్య’ లో మరో సర్ ప్రయిజ్ కూడా ఉందని తెలుస్తుంది. టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇందులో ఓ క్యామియో చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సినిమాలో చిరు – చరణ్ ఇద్దరు నక్సలైట్ రోల్స్ లో కనిపిస్తూ ఓ భారీ ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ లో అనుష్క నక్సలైట్ రాములక్కగా కనిపించనుందని ఇన్సైడ్ టాక్. అయితే అనుష్క జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే ఈ క్యామియోతో కనిపిస్తుందని తెలుస్తుంది.

గతంలో చిరు నటించిన ‘స్టాలిన్’ సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది అనుష్క. ఇక ‘సైరా నరసింహా రెడ్డి’ లో కూడా చిరు పాత్రను ఎలివేట్ చేసే స్పెషల్ క్యామియో చేసింది. మరి ఇప్పుడు ఆచార్య లో కూడా అనుష్క కనిపిస్తే ముచ్చటగా మూడో సారి అనుష్క చిరు సినిమాలో ఉన్నట్టే. అనుష్క క్యామియో విషయం నిజమేనా కదా అనేది మరో రెండ్రోజుల్లో తేలిపోతుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics