గ్యాప్ వచ్చేసరికి ఫోకస్ 'లక్ష్మీస్ NTR'పై!!

Friday,March 01,2019 - 04:21 by Z_CLU

RGV ‘లక్ష్మీస్ NTR’రిలీజ్ డేట్ ఫిక్సయింది. మార్చి 22 న ఈ సినిమా రిలీజవుతోంది. సోషల్ మీడియాలో ఆల్రెడీ ఈ సినిమా హడావిడి బిగిన్ అయింది. రీసెంట్ గా ట్రైలర్, ఆ తరవాత వరస సింగిల్స్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు మేకర్స్.

సినిమా ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటుందనేది పక్కన పెడితే, ప్రస్తుతం రిలీజ్ కి దగ్గరలో ఉన్న బయోపిక్ ఇదే కావడంతో… సోషల్ మీడియాలో ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న డిఫెరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీ, స్ట్రేట్ గా ఆడియెన్స్ ని రీచ్ అవుతుంది. నిన్నా మొన్నటి వరకు ‘NTR మహానాయకుడు’ హడావిడి లో ఈ సినిమాపై బజ్ కాస్త తగ్గినట్టు అనిపించినా, ఇప్పుడు దగ్గరలో రిలీజ్ కి రెడీగా ఉన్న బయోపిక్ ఇదే కావడంతో న్యాచురల్ గానే ఫోకస్ లోకి వచ్చేసింది ‘లక్ష్మీస్ NTR’.

లక్ష్మీ పార్వతి NTR లైఫ్ లోకి వచ్చిన తరవాత ఆయన లైఫ్ లో చోటు చేసుకున్న సంఘటనలు, ఆయన రాజకీయ జీవితంలో వచ్చిన మార్పులు తదితర అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ బయోపిక్ ల లిస్ట్ లో చేరుతుందా..? లేదా అనేది చూడాలి.