లక్ష్మీ రాయ్ ఇంటర్వ్యూ

Monday,February 18,2019 - 08:51 by Z_CLU

లక్ష్మీరాయ్ లీడ్ రోల్ ప్లే చేసిన సినిమా ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’. అల్టిమేట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన లక్ష్మీరాయ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుంది.

అదీ సినిమా…

‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఏదో ఒకదానికోసం వెదుకుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ లో కామెడీ జెనెరేట్ అవుతుంది.

అలా ఉంటుంది…

ఈ సినిమాలో నేను టీచర్ రోల్ ప్లే చేశాను. దానికి తోడు గ్లామరస్ గా ఉండే రోల్ నాది. హిందీ సినిమా ‘మై హూ నా’ లో సుస్మితా సేన్ ప్లే చేసిన రోల్ లాంటిది.

ఇలాంటి సినిమాలు…

కామెడీ బేస్డ్ సినిమాలు ఇంకా రావాలి. తెలుగులో అలాంటి సినిమాల సక్సెస్ రేషియో చాలా ఎక్కువగా ఉంది.

నాకు తెలుగు రాదు…

నాకు తెలుగు రాదు కాబట్టి స్క్రిప్ట్ లో ఉన్న ప్రతి పదం అర్థం కనుక్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా సెట్స్ పై చాలా నవ్వుకునేదాన్ని. అలాంటిది ఇంకా తెలుగు ఆడియెన్స్ కైతే కామెడీ ట్రీట్ లా ఉంటుంది.

అలా జరిగిపోయిందంతే…

నేను ఇంట్రడ్యూస్ అయిందే తమిళ ఇండస్ట్రీలో. తెలుగులో కూడా కాంచనమాల కేబుల్ టి.వి. చేసినపుడు నాకు జస్ట్ 15 ఏళ్ళు. ఆ తరవాత వరసగా తమిళ భాషల్లో డిఫెరెంట్ రోల్స్ వస్తుండటంతో అక్కడ బిజీ అయిపోయాను. ఇన్నాళ్ళకు మళ్ళీ తెలుగులో చేసే అవకాశం వచ్చింది.

చాలా గర్వంగా ఫీలవుతా…

నా దృష్టిలో ఐటమ్ సాంగ్ చేయడమంటే చాలా గర్వంగా ఫీలవుతా. నటిగా నేను అన్ని రకాలుగా ఆడియెన్స్ కి దగ్గరవ్వాలనే అనుకుంటా…

అది మనం చేసిందే…

బాలీవుడ్ హీరోయిన్స్ చేస్తే దాన్ని స్పెషల్ సాంగ్ అంటారు.. అదే సౌతిండియాలో  చేస్తే దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు. ఆలోచన  మారాలి.

 

బాలీవుడ్ కన్నా మనమే బెస్ట్…

సౌత్ ఇండియన్ సినిమాలో ట్యాలెంట్ ని బట్టి యాక్టర్స్ ని ఎంచుకుంటారు. కానీ బాలీవుడ్ లో అలా కాదు. అసలు సినిమా ఉంటుందో లేదో కూడా తెలీదు, ఆడిషన్స్ మాత్రం జరుగుతూనే ఉంటాయి. అందుకే ఒక సినిమా తర్వాత నేను మళ్ళీ ట్రై చేయదలుచుకోలేదు…

దర్శకుడు కిషోర్ గురించి…  

కిషోర్ కుమార్ సెట్స్ లో చాల ఫన్ ఉంటుంది. సినిమా అసలు ఎప్పుడైపోయిందా అనిపించింది. అంత స్ట్రెస్ లెస్ గా ఉంటుంది ఆయన సెట్స్ లో .

నా ఫేవరేట్ సాంగ్…

‘పాప నీకేమంటే ఇష్టం..’ నా మోస్ట్ ఫేవరేట్ సాంగ్. నిజానికి ఈ సాంగ్ వేరే వాళ్ళు చేయాలి. కానీ నాకు నచ్చి నేనే చేస్తాను అని పట్టుపట్టి  చేశాను.. అంతగా నచ్చేసింది.

ప్రస్తుతానికి తెలుగులో…

తెలుగులో ఇంకా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఒక సినిమా నేను, అంజలి కలిసి చేయాలి. కాకపోతే డేట్స్ మ్యానేజ్ అవ్వడం లేదు. ఇప్పటికే ఆల్రెడీ 4 సినిమాలకు సంతకం చేశాను. వీటి మధ్య నేను చేయగలనో లేదో, నాకు ఇంకా క్లారిటీ లేదు.