సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘లాగే లాగే’

Friday,March 10,2017 - 10:00 by Z_CLU

జస్ట్ హల్ చల్ కాదు పెద్ద సెన్సేషనే క్రియేట్ చేస్తున్నాడు కాటమరాయుడు. నిన్న సాయంత్రం 4గంటలకు రిలీజైన ‘లాగే లాగే సింగిల్’ 24 గంటలు కూడా గడవక ముందే 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి పెద్ద సెన్సేషనే క్రియేట్ చేస్తోంది. గంట గంటకీ పెరుగుతున్న వ్యూస్ తో సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్ లా మారింది ‘లాగే లాగే’ సాంగ్.

ఒక్కో సింగిల్ ని రిలీజ్ చేస్తూ ఎక్స్ పెక్టేషన్స్ రేంజ్ మరింతలా పెంచుకున్న కాటమరాయుడు… మార్చి 24 నుండి థియేటర్స్ లో దుమ్ము రేపడానికి రెడీ అయిపోయాడు. ఈనెల 18న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

పవన్-శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు డాలీ దర్శకుడు. శరత్ మరార్ నిర్మాత.