Kushi విజయ్ అభిమానులకు సమంత సారీ

Wednesday,February 01,2023 - 04:11 by Z_CLU

Kushi movie – Samantha said sorry to vijay fans

విజయ్ దేవరకొండ -సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషి’ Kushi షూటింగ్ కొన్ని నెలలుగా సమంత అనారోగ్యం కారణంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి నుండి సమంత ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుందని ప్రచారం జరిగింది. కానీ సమంత Samantha తాజాగా ముంబై లో రాజ్-డీకే తీస్తున్న వెబ్ సిరీస్ ఘాట్ స్టార్ట్ చేయడంతో ఖుషి షూటింగ్ కి మళ్ళీ బ్రేక్ పడనుందనే టాక్ మొదలైంది.

వెబ్ సిరీస్ షూటింగ్ న్యూస్ తెలియగానే విజయ్ ఫ్యాన్స్ సమంతను  ‘ఖుషి’ షూటింగ్ సంగతేంటి ? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దానికి సమాధానంగా సమంత విజయ్ ఫ్యాన్స్ కి రిప్లై ఇస్తూ అతి త్వరలోనే ఖుషి షూటింగ్ లో జాయిన్ అవుతానని చెప్పుకుంది. ‘ఖుషి’ షూటింగ్ తన వల్లే డిలే అవుతున్న విషయం తెలుసు కాబట్టి విజయ్ ఫ్యాన్స్ కి సారీ చెప్పింది సమంత. విజయ్ కూడా సమంత పూర్తి ఆరోగ్యంతో  బిగ్ స్మైల్ తో తిరిగి రావాలని కోరుతూ ట్వీట్ చేశాడు.

మరి వెబ్ సిరీస్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి సమంత ‘ఖుషి’ ఘాట్ లో పాల్గొంటుందా ? లేదా సిరీస్ కంప్లీట్ చేశాకే ఖుషి కి డేట్స్ ఇస్తుందా ? చూడాలి.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics