కుంగ్ ఫు యోగ రేపే రిలీజ్

Thursday,February 02,2017 - 12:44 by Z_CLU

 మరి కొద్ది గంటల్లో థియేటర్స్ లో కుంగ్ ఫూ హంగామా బిగిన్ కానుంది. హాంగ్ కాంగ్ స్టార్ జాకీచాన్, సోను సూద్ నటించిన కుంగ్ ఫు యోగ యాక్షన్ అడ్వెంచరస్ కామెడీ ఎంటర్ టైనర్ ఇప్పటికే చైనాలో రిలీజయి బాక్సాఫీస్ బద్దలు కొట్టే పనిలో ఉంది.

హాంగ్ కాంగ్, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఒక్క ట్రాక్ పైకి తీసుకొచ్చిన ఈ సినిమా బోలెడన్ని సర్ ప్రైజెస్ తో ఎంటర్ టైన్ చేయనుంది. జాకీచాన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ సినిమా కావడంతో సినిమాపై ఇప్పటికే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి.

salman-khan-kung-fu-yoga-promotions

జాకీచాన్ ని ఇండియన్ స్టైల్ లో ప్రెజెంట్ చేసిన ఈ సినిమాలో సోను సూద్ తో పాటు దిశా పటాని, అమైరా దస్తూర్ హీరోయిన్స్ గా నటించారు. అటు మాస్, క్లాస్ అని తేడా లేకుండా టోటల్ ఫిలిం లవర్స్ ని టార్గెట్ చేస్తున్న కుంగ్ ఫు యోగ ప్రమోషన్స్ కి మొత్తం బాలీవుడ్ ఇన్వాల్వ్ అవుతోంది.

sonu-sood-jackie-chan-kungfu-yoga

దుబాయ్, ఐలాండ్, బీజింగ్ మరియు ఇండియా లోని బెస్ట్ లోకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న కుంగ్ ఫు యోగ స్టాన్లీ టాంగ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. టాలీవుడ్ లోను ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ని సెట్ చేసిన ఈ సినిమా, ఆల్ రెడీ సెట్ అవుతున్న కొత్త ట్రెండ్స్ కి, అడిషనల్ ఎట్రాక్షన్ లా ఎట్రాక్ట్ చేస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా అడ్వెంచరస్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.