సెట్స్ పైకి రానున్న కుమారి 21 F కాంబో

Wednesday,February 21,2018 - 02:49 by Z_CLU

రీసెంట్ గా కుమారి 21 F డైరెక్టర్ సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో రాజ్ తరుణ్ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ ప్లేస్ లో మరో యంగ్ హీరోని ఫిక్స్ చేసుకునే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ రూమర్స్ లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు ఫిల్మ్ మేకర్స్.

‘సూర్య ప్రతాప్, రాజ్ తరుణ్ ని మైండ్ లో పెట్టుకునే స్టోరీ ప్లాన్ చేసుకున్నారు, అలాంటప్పుడు  హీరోని రీప్లేస్ చేయాల్సిన అవసరమే లేదు’  అని  స్పష్టంచేశారు  ప్రొడ్యూసర్ రామ్ తాళ్ళూరి. సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించే హీరోయిన్ తో పాటు, మిగతా టెక్నీషియన్స్ ని త్వరలోనే ప్రకటించనున్నారు. మార్చి చివరి వారానికి సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ‘లవర్’ సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమా తరవాత సూర్య ప్రతాప్ తో సినిమా ఉంటుంది.