కుమారి 21 F కాంబినేషన్ రిపీట్

Saturday,July 29,2017 - 07:20 by Z_CLU

సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21 F’ అటు రాజ్ తరుణ్, ఇటు హెబ్బా పటేల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సెన్సేషనల్ హిట్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందనే టాక్ టాలీవుడ్ లో చిన్న సైజు సెన్సేషన్ నే క్రియేట్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ హెబ్బా పటేల్ కాకుండా మరో ఫీమేల్ లీడ్ ని ఫిక్స్ చేసుకోవాలనే ఆలోచనలో ఉందట సినిమా యూనిట్.

ఇప్పటి వరకు రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ మూడు సినిమాల్లో వరసగా జత కతడంతో ఈ సారి మరో హీరోయిన్ ని ఫిక్స్ చేసుకోవాలని నిర్ణయించినట్టుంది సినిమా యూనిట్. ప్రస్తుతం ‘దర్శకుడు’ సినిమా ప్రమోషన్స్ పనులతో పాటు, రంగస్థలం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న సుక్కు, త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి కూడా DSP మ్యూజిక్ కంపోజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ఈ విషయం సుకుమార్ కానీ, రాజ్ తరుణ్ అఫీషియల్ గా అయితే కన్ఫం చేయలేదు కానీ, ఈ టాక్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ చూస్తుంటే,  ఈ కాంబోపై ఏ రేంజ్ లో డిమాండ్ క్రియేట్ అయి ఉందో అర్థమవుతుంది. మరి ఈ టాక్ జస్ట్ టాక్ మిగిలిపోతుందా అఫీషియల్ గా కన్ఫం అవుతుందా అనేది ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తే కానీ క్లారిటీ రాదు.