రామ్ హీరోయిన్ ప్రేమలో పడింది

Wednesday,November 20,2019 - 03:33 by Z_CLU

రామ్ సరసన ఒంగోలుగిత్త సినిమాలో నటించిన కృతి కర్బందా ప్రేమలో పడింది. నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నట్టు స్వయంగా ప్రకటించింది ఈ బ్యూటీ. దాదాపు రెండేళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారట.

అనీల్ కపూర్, జాన్ అబ్రహాం హీరోలుగా రాబోతోంది పాగల్ పంతి సినిమా. ఇదే సినిమాలో కృతి కర్బంద, పులకిత్ సామ్రాట్ కూడా నటించారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన లవ్ మేటర్ ను బయటపెట్టింది కృతి. ఇంట్లో పెద్దలకు కూడా తమ లవ్ మేటర్ చెప్పేశామని, అందుకే ఇప్పుడు అధికారికంగా మీడియాకు చెబుతున్నామని ప్రకటించింది.

కృతి కెరీర్ టాలీవుడ్ మూవీతోనే స్టార్ట్ అయింది. సుమంత్ హీరోగా నటించిన బోణీ సినిమాతో ఈమె హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తీన్ మార్, ఓం త్రీడీ, మిస్టర్ నూకయ్య, బ్రూస్ లీ లాంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.