Krithi Shetty - కొత్తగా రెండు సినిమాలు

Sunday,November 15,2020 - 01:06 by Z_CLU

మొదటి సినిమా సూపర్ హిట్టయితే ఏ హీరోయిన్ కైనా వరుస ఆఫర్స్ వస్తుంటాయి. కానీ దీనికి Krithi Shetty మినహాయింపు. ఇంకా డెబ్యూ సినిమా విడుదలవ్వకుండానే రెండు క్రేజీ ఆఫర్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే ‘Uppena’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న కృతి.. మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా సాంగ్స్ లో తన హావభావాలతో యువతను ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు హీరోయిన్ గా రెండు సినిమాలు అందుకుంది.

ఇటివలే Nani Shyam Singha Roy లో ఒక హీరోయిన్ గా కీర్తి పేరు ఎనౌన్స్ చేశారు మేకర్స్. అలాగే Sudheer Babu తో ఇంద్రగంటి మోహనకృష్ణ తీయబోతున్న ఓ రొమాంటిక్ సినిమాలో కూడా కృతి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. మరి మొదటి సినిమా విడుదల అవ్వకుండానే టాలీవుడ్ లో రెండు ఆఫర్స్ అందుకున్న ఈ బ్యూటీ ఉప్పెన విడుదల తర్వాత మరిన్ని సినిమాలు సొంతం చేసుకోవడం ఖాయమనిపిస్తుంది.