Krithi Shetty - పుకార్లకు చెక్ పెట్టిన ఉప్పెన బ్యూటీ

Wednesday,May 19,2021 - 02:29 by Z_CLU

ఒక సినిమా సూపర్ హిట్టయితే చాలు అందులో నటించిన హీరోయిన్ కి వరుస ఆఫర్లు వస్తాయి. సరిగ్గా ఇప్పుడు కృతి శెట్టి అలాంటి ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది. ఇటివలే తేజ-దగ్గుబాటి అభిరామ్ కాంబో సినిమాకు కూడా కృతి ని సంప్రదించారట మేకర్స్. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ ప్రాజెక్ట్ కి అమ్మడు రెడ్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇదే కాదు కృతి డేట్స్ కోసం ఎదురుచూస్తున్న మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.

krithi shetty

‘ఉప్పెన’ రిలీజ్ కంటే ముందే ఊహించని క్రేజ్ అందుకుంది కృతి. అమ్మడి అందానికి ,అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఈ క్రేజీ బ్యూటీపై ప్రస్తుతం ఆఫర్ల వర్షం కురుస్తోంది. దీంతో కృతి ఆ హీరోతో సినిమా చేస్తుంది. ఈ సినిమా ఒప్పుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయం తెలుసుకున్న కృతి తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం నటిస్తున్న నాని ‘శ్యామ్ సింగ రాయ్’, సుదీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ తో పాటు రీసెంట్ గా కమిట్ అయిన రామ్ సినిమాలో నటిస్తునట్లు చెప్పుకుంది. ప్రస్తుతానికి తన దృష్టి ఈ మూడు సినిమాల మీదే ఉందని, ఒక వేళ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా సైన్ చేస్తే కచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చింది.

Krithi Shetty

ఉప్పెన సినిమాలో కృతి శెట్టి

కృతి ఇచ్చిన ఈ క్లారిటీతో ఆమె నెక్స్ట్ సినిమాపై చక్కర్లు కొడుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ఈ మూడు సినిమాలతో కృతి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడితే కచిటంగా స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవడం ఖాయం. అప్పుడు అమ్మడి ముందు క్యూ కట్టి మరిన్ని ఆఫర్లు అందిస్తారు మన దర్శక నిర్మాతలు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics