Krithi Shetty - మరోసారి మెగా కాంపౌండ్ లో..!

Wednesday,May 26,2021 - 05:26 by Z_CLU

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి కూడా హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందే తన అందం అభినయంతో యువతను విపరీతంగా ఆకట్టుకున్న కృతి ఇప్పుడు వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపొయింది. ప్రస్తుతం కృతి చేతిలో మూడు సినిమాలున్నాయి. దీంతో ఈ ముంబై బ్యూటీ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు కొందరు దర్శక నిర్మాతలు. అయితే తాజాగా కృతి శెట్టి ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

Krithi Shetty new stills zeecinemalu

కృతి షెట్టి

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ , సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ సినిమా ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కొందరిని లిస్ట్ చేసి అందులో నుండి కృతిని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

తాజాగా కృతి శెట్టి ని కార్తీక్ దండు సంప్రదించి ఆమెకి స్క్రిప్ట్ వినిపించాడని సమాచారం. అయితే ప్రస్తుతం నాని ‘శ్యామ్ సింగ రాయ్’ తో పాటు , సుదీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలతో పాటు రామ్ -లింగుస్వామి కాంబినేషన్ సినిమా కూడా కమిట్ అయ్యింది కృతి. మరి ఇంత బిజీ షెడ్యుల్ లో తేజ్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేస్తుందా ? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉంది.

ఉప్పెన సినిమాకు సుకుమార్ ఒక నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. తనకి అవకాశం ఇచ్చిన సుకుమార్ కోసం కృతి తేజ్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసే ఆలోచనలో ఉందని ఇన్సైడ్ టాక్. మరి తమ్ముడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి ఇప్పుడు తేజ్ సినిమా సైన్ చేస్తే అన్నదమ్ములిద్దరితో నటించినట్టే.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics