మరో ప్రాజెక్ట్ ప్రకటించిన కృష్ణవంశీ

Thursday,October 17,2019 - 02:54 by Z_CLU

కృష్ణవంశీ ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడనీ, ఆ సినిమా కోసం ఆయన రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నాడనే గాసిప్ కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. అయితే కృష్ణవంశీ ఏ సినిమా చేస్తున్నాడు? అది ఎప్పుడు మొదలుకానుంది? అనే విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఇన్నాళ్లకు ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.

2016లో వచ్చిన మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కి రీమేక్ గా కృష్ణవంశీ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి ‘రంగమార్తాండ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి, అఫీషియల్ పోస్టర్ ను వదిలాడు. మరాఠీలో నానాపటేకర్ చేసిన పాత్రలో ప్రకాశ్ రాజ్.. ఆయన సరసన రమ్యకృష్ణ నటించనున్నారు.

అభిషేక్ – మధు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ‘శ్రీఆంజనేయం’ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేస్తున్న సినిమా ఇదే. నక్షత్రం తర్వాత కృష్ణవంశీ చేస్తున్న సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.