Adipurush - కీలక పాత్రలో రెబల్ స్టార్

Sunday,September 13,2020 - 11:02 by Z_CLU

ప్రభాస్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ మూవీ అప్ డేట్స్ మినిమం గ్యాప్స్ లో వస్తూనే ఉన్నాయి. అయితే ఎన్ని అఫీషియల్ అప్ డేట్స్ వస్తున్నాయో, అన్ని గాసిప్స్ కూడా రౌండ్స్ కొడుతున్నాయి. లేటెస్ట్ రూమర్ ఏంటంటే.. Adipurush లో KrishnamRaju కూడా ఉన్నారట.

Prabhas ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక రావణుడి పాత్ర కోసం Saif ను ఆల్రెడీ సెలక్ట్ చేశారు. ఇప్పుడీ సినిమాలో కీలకమైన మరో పాత్ర కోసం కృష్ణంరాజును తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది.

 

Adipurush లో కృష్ణంరాజు పాత్రపై యూనిట్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు కానీ హీరోయిన్ పాత్రపై మాత్రం చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు Om Raut. సీత పాత్ర కోసం ఇంకా ఏ హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదంటున్నాడు ఈ దర్శకుడు. పాన్ ఇండియా అప్పీల్ ఉండే హీరోయిన్ నే సెలక్ట్ చేస్తామన్నాడు.

ఈ సినిమా షూట్ ను జనవరి నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు. కేవలం 70 రోజుల్లో షూట్ పూర్తిచేసి గ్రాఫిక్స్ కు వెళ్లాలనేది ప్లాన్. ముందుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో అనుకున్న ఈ సినిమా.. ఇప్పుడు 700 కోట్ల రూపాయలకు చేరినట్టు టాక్.