లిరిసిస్ట్ 'కృష్ణ కాంత్' ఇంటర్వ్యూ

Wednesday,December 12,2018 - 05:59 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘పడి పడి లేచే మనసు’ టైటిల్ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ క్రియేట్ చేసిన వైబ్స్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈ సాంగ్ తరవాత వరసగా రిలీజైన సాంగ్స్, జస్ట్ ట్యూన్స్ పరంగానే కాదు, ఇంతకీ లిరిక్స్ రాసిన లిరిసిస్ట్ ఎవరా అనిపించేంతలా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమాకు సింగిల్ కార్డ్ లిరిక్స్ అందించిన K.K. అనుభూతులు ఆయన మాటల్లోనే…

సింగిల్ కార్డ్

ఎప్పటి నుండో నేను ఎదురుచూస్తున్న ఆల్బం ఇది.. విశాల్ చంద్రశేకర్ మ్యూజిక్ తో పాటు నా సాహిత్యం కి ప్రేక్షకులు ఎంత వరకూ రీచ్ అవుతుందా అని వెయిట్ చేశా. అనుకున్నట్లే ప్రేక్షకులు ఫస్ట్ సింగిల్ పడి పడి లేచె మనసు’ నుండే కనెక్ట్ అయిపోయారు. ఆ సాంగ్ రిలీజయినప్పటి నుండి ఇప్పటి వరకూ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో సాంగ్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తుంటే సంతోషంగా ఉంది. ముఖ్యంగా కల్లోలం సాంగ్ లో లిరిక్స్ గురించి చెప్తూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం హ్యాపీ గా ఫీలయ్యా. నిజానికి మన వర్క్ కి అభినందనలు లబించినప్పుడు మన కష్టం మర్చిపోయి ఎంజాయ్ చేస్తాం. ప్రెజెంట్ నేను అదే ఫీల్ లో ఉన్నా.


దేనికదే సెపరేట్

ఇందులో ఏది నా ఫేవరేట్ అంటే చెప్పలేను. వేటికదే స్పెషల్. కాకపోతే పడి పడి మనసు టైటిల్ సాంగ్ కాస్త ఎక్కువ ఇష్టం. నాకే కాదు ఆ సాంగ్ ఆల్మోస్ట్ అందరికీ ఫేవరేట్ అయిపొయింది.

 

విశాల్ చంద్ర శేకర్ తో …

విశాల్ చంద్ర శేకర్ తో కలిసి వర్క్ చేయడం సంతోషాన్నిచ్చింది. మా కాంబినేషన్ లో వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమగాధ’ ఆల్బం సూపర్ హిట్టైంది. అందులో ముఖ్యంగా ‘నువ్వంటే నాకిష్టం’ సాంగ్ మాకు సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. చాలా కూల్ గా ఉంటూ బెస్ట్ లిరిక్స్ తీసుకోవడం విశాల్ చంద్రశేకర్ స్పెషాలిటీ.

 

ఎక్కువ అవే

లిరిసిస్ట్ గా నేను ఎక్కువ వర్క్ చేసింది లవ్ స్టోరీస్ కే. అందులో మంచి ప్రావిణ్యం పొందాను. నిజానికి నేను రాసిన ప్రేమ గీతాలు అప్పుడప్పుడూ ఎవరి ద్వారా అయినా వింటే భలే ఫీల్ కలుగుతుంది. ఈ జోనర్ కే అంకితం కాకుండా డిఫరెంట్, చాలెంజింగ్ సాంగ్స్ రాయాలనుంది.

కలిసొచ్చింది

ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా గ్యాంగ్ సినిమాలో నేను రాసిన మాస్ సాంగ్ ‘చిటికె మీద’, ఏమైంది ఈ నగరానికి లో ‘ఆగి ఆగి సాగే’ , శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో ‘ఎగిరేగిరే’ సాంగ్స్ మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక ‘టాక్సీ వాలా’లో నేను రాసిన ‘మాటే వినదుగా’ సాంగ్ 2018 మోస్ట్ పాపులర్ నంబర్ లో మంచి స్థానం అందుకుంది. ఇక ‘పడి పడి లేచె మనసు’ సాంగ్స్ రెస్పాన్స్ కూడా ఎక్స్ట్రా బోనస్.

 

వేటూరి గారు

లిరిసిస్ట్ గా వేటూరి గారే నాకు ఆదర్శం. ఆయన వాడినన్ని తెలుగు పదాలు ఇంకెవరూ వాడలేదని నా ఫీలింగ్. సిరివెన్నెల గారి సాహిత్యం కూడా ఇష్టం. పాటలు రాసినప్పుడు ఈ ఇద్దరినీ తలుచుకొని నా సాహిత్యం కూడా వారిలా ఉండాలని తాపత్రయపడుతుంటా.. అందుకేనేమో లిరిసిస్ట్ గా నాకంతో ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకోగాలిగాను.

 

హను నేను అంతే…

‘హాను’తో అందాల రాక్షసి నుండి వర్క్ చేస్తున్నా.. ప్రతీ సినిమాకి ఇంక మనకి సెట్ అవ్వదు.. నెక్స్ట్ నీతో సినిమా చేయను అనుకుంటూనే మళ్ళీ పని చేస్తుంటాం. మా రిలేషన్ షిప్ అలా ఉంటుంది. హను ఈ సినిమాతో మళ్ళీ సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ.

 

మరో యూ.వి, మైత్రీ

నిర్మాత సుధాకర్ చెరుకూరి గారు మంచి సపోర్ట్ అందించారు. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉంటాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ కచ్చితంగా మరో మైత్రీ మోవీ మేకర్స్ , యూ.వి క్రియేషన్స్ లాంటి సంస్థ అవుతుంది.

 

ప్రభాస్ 20, జెర్సీ ….

ప్రస్తుతం ప్రభాస్ -రాదా కృష్ణ సినిమాకు వర్క్ చేస్తున్నా.. అలాగే నాని ‘జెర్సీ’ , రాజశేఖర్ ‘కల్కి’ , తమన్నా ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమాలకు సింగిల్ కార్డ్ లిరిక్స్ అందిస్తున్నా.