క్రిష్ అడుగెటు ?

Tuesday,March 14,2017 - 09:12 by Z_CLU

చారిత్రాత్మక సినిమాతో బాలయ్య ను ఇప్పటి వరకూ చూడని గెటప్ లో చూపించి సంక్రాంతి హిట్ అందుకున్న దర్శకుడు క్రిష్ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అనౌన్స్ చేయకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నాడు..

మొన్నటి వరకూ వెంకటేష్ తో క్రిష్ ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపించగా, ఆ తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వినిపించింది.. అయితే లేటెస్ట్ గా క్రిష్ నెక్స్ట్ సినిమా లిస్ట్ లోకి కళ్యాణ్ రామ్ కూడా చేరాడు.. క్రిష్ ఓ డిఫరెంట్ కథ తో కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే క్రిష్ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసే వరకూ వెయిట్ చేయాల్సిందే…