అదే రిపీట్..

Saturday,December 17,2016 - 07:00 by Z_CLU

టాలీవుడ్ డైరెక్టర్స్ ఒక్కొక్కరిది ఒక్కో పంథా. అందులో డైరెక్టర్ క్రిష్ మొదటి స్థానంలో ఉంటాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా తన మేకింగ్ స్టైల్ తో డైరెక్టర్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు క్రిష్. ఇక ఈ డైరెక్టర్ అంటే టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు  సెలబ్రిటీలకు సైతం  ఎనలేని అభిమానం. అందుకే క్రిష్ సినిమా వస్తుందంటే చాలు తమ వంతు సపోర్ట్ చేస్తూ ప్రశంసలు అందిస్తుంటారు. లెటస్ట్ గా రిలీజ్ అయిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ట్రైలర్ కు వచ్చిన  రెస్పాన్సే ఇందుకు మరో ఉదాహరణ.

   క్రిష్ లాస్ట్ సినిమా ‘కంచె’ ట్రైలర్ కూడా ఇలాంటి గ్రేట్ రెస్పాన్స్ అందుకుని టాలీవుడ్ లో  ఒక మంచి సినిమాగా గుర్తింపు  పొందింది.  ఈ సినిమా తో   నేషనల్ అవార్డు అందుకున్న క్రిష్ మరో సారి అలాంటి ప్రశంసలే ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ట్రైలర్ తో  అందుకున్నాడు  . నిన్న రిలీజ్ అయిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ట్రైలర్ తో మరో సారి  ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాడు ఈ డైరెక్టర్. తక్కువ టైం లో ఎవ్వరు ఊహించిన అవుట్ ఫుట్ తో ట్రైలర్ చూపించి ప్రేక్షకులతో పాటు స్టార్స్ ను సైతం ఎట్రాక్ట్ చేసి ప్రశంశలు అందుకుంటున్నాడు. ఈ ట్రైలర్ ఆల్మోస్ట్ టాలీవుడ్ స్టార్స్ అందరి ప్రశంసలు అందుకోవడం తో మరో సారి ఈ రిపీట్ ప్రశంసలతో సంక్రాంతికి గ్రాండ్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు క్రిష్.

 

ntr-tweet

rajamouli-tweet

varma-tweet

koratala-siva-tweet

kalyan-ram-tweet

tamanna-tweet

rakul-tweet

siddarth-tweet

nithin-tweet

aadi-tweet

pragya-tweet

devakatta-tweer

harish-shankar-tweet

allari-naresh-tweet