క్రిష్ 'అహం బ్రహ్మస్మి'... హీరో ఎవరు ...?
Monday,April 09,2018 - 10:32 by Z_CLU
ప్రెజెంట్ కంగనా రనౌత్ తో ‘మణి కర్ణిక’ అనే సినిమా చేస్తున్నాడు క్రిష్. ‘ఝాన్సీ లక్ష్మి భాయ్’ బయోపిక్ గా హిందీ, తెలుగు, తమిళ్ తెరకెక్కుతున్న ఈ సినిమాతో బిజీ గా ఉన్న క్రిష్ మరో వైపు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టేశాడు. ఇప్పటికే ‘మణికర్ణిక’ కి సంబంధించి షూటింగ్ ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చిన క్రిష్ త్వరలోనే తెలుగులో తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటివలే నెక్స్ట్ సినిమాకు ‘అహం బ్రహ్మస్మి’ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసాడు.
అయితే ఈ టైటిల్ తో ఇప్పుడు క్రిష్ ఏ హీరోతో సినిమా చేస్తాడా..అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య వెంకీ తో ఓ సినిమా చేద్దామనుకున్నాడు క్రిష్ కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. ఆ తర్వాత క్రిష్ నెక్స్ట్ సినిమా లిస్టు లో కొందరు హీరోల పేర్లు వినిపించాయి. అయితే క్రిష్ బన్నీ తో ఈ సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడని, ఇప్పటికే బన్నీ కి కథ వినిపించాడని తెలుస్తుంది. మరి బన్నీ తోనే ‘అహం బ్రహ్మస్మి’ సినిమాను తెరకెక్కిస్తాడా.. చూడాలి.