క్రిష్ నెక్ట్స్ మూవీ డీటెయిల్స్

Thursday,November 03,2016 - 02:15 by Z_CLU

ప్రస్తుతం బాలయ్య ప్రతిష్టాత్మక సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహిస్తున్నాడు క్రిష్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉంది. సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య అప్పుడే తన 101వ మూవీని ఎనౌన్స్ చేశాడు. దర్శకుడు కృష్ణవంశీతో కలిసి సెట్స్ పైకి  వెళ్లబోతున్నాడు. మరి క్రిష్  నెక్ట్స్ సినిమా ఏంటి…? తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.

akshay-kumar-shruti-hasan-2-1024x681

తాజా సమాచారం ప్రకారం.. క్రిష్ తన నెక్ట్స్ మూవీని బాలీవుడ్ లో ప్లాన్  చేస్తున్నాడట. ఇప్పటికే గబ్బర్ ఈజ్ బ్యాక్ మూవీతో బాలీవుడ్ లో  ఓ సినిమా చేశాడు క్రిష్. అక్షయ్ కుమార్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో ఓ మోస్తరు విజయాన్నందుకుంది. ఇప్పుడు మరోసారి అక్షయ్  కుమార్ తోనే క్రిష్ తన నెక్ట్స్ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్రిష్ ఓ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నాడు.