క్రిష్ ‘మణికర్ణిక’ లాంచ్ ఈ రోజే

Thursday,May 04,2017 - 01:02 by Z_CLU

గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీ తరవాత క్రిష్ మరో సినిమా తో రెడీ అయిపోయాడు. తన నెక్స్ట్ సినిమాని కూడా హిస్టారికల్ జోనర్ లోనే పిక్ చేసుకున్న క్రిష్.. ఈసారి తెలుగు-తమిళ-హిందీ భాషల్లో సినిమా తీయబోతున్నాడు.

ఝాన్సీరాణి లక్ష్మీ బాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘మణికర్ణిక’ టైటిల్ ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వారణాసి లో 20 అడుగుల పోస్టర్ ని గ్రాండ్ గా లాంచ్ చేయనుంది. కంగనా రనౌత్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు.

 

 

 గౌతమీపుత్ర శాతకర్ణీ తో టాలీవుడ్ లో హిస్టారికల్ సినిమాలకు సరికొత్త డిమాండ్ ని క్రియేట్ చేసిన క్రిష్, ఇప్పుడు అదే మేజిక్ ని మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్కెచ్ ఇప్పటికే బయటకొచ్చిన విషయం తెలిసిందే.