మోక్షజ్ఞ సినిమాకి దర్శకుడు ఫిక్స్ ?

Friday,September 08,2017 - 11:00 by Z_CLU

తనయుడు మోక్షజ్ఞ ను వచ్చే ఏడాది హీరోగా తెరంగేట్రం చేస్తానని బాలయ్య ఇటీవలే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఘనంగా లాంచ్ కానున్న మోక్షజ్ఞ ఎంట్రీ కి సర్వం సిద్ధం చేస్తూ ఆ పనిలో నిమగ్నమయ్యాడట బాలయ్య. ఇప్పటికే బాలయ్య మోక్షజ్ఞ సినిమా బాధ్యతను తన వందో సినిమా దర్శకుడు క్రిష్ కి అప్పజెప్పాడనే వార్త వినిపిస్తుంది.

లేటెస్ట్ గా బాలయ్య- క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన మోక్షజ్ఞ క్రిష్ దర్శకత్వంలో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడట బాలయ్య. ప్రస్తుతం కంగనా తో ‘మణి కర్ణిక’ సినిమాను తెరకెక్కిస్తున్న క్రిష్ ఈ సినిమా పూర్తవ్వగానే మోక్షజ్ఞ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడని సమాచారం. అన్ని కుదిరితే ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మించే ఛాన్స్ ఉంది.