క్రిష్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Monday,January 09,2017 - 06:23 by Z_CLU

విభిన్న సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు క్రిష్. ఈ క్రియేటివ్ డైరక్టర్ లేటెస్ట్ గా బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కానున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు అంజనీపుత్ర క్రిష్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

*ఆ టైం లో అనుకున్న కథ

‘కృష్ణంవందే జగద్గురుమ్’ షూటింగ్ టైంలోనే ఈ కథ అనుకున్నా. అప్పటి నుంచే కాస్త రీసెర్చ్ మొదలుపెట్టాను. ఏదో కొత్త కథలు ప్రేక్షకులకు చూపిస్తే బాగుంటుందని ప్రతీ క్షణం ఆలోచిస్తుంటా. అందుకే ఈ గొప్ప కథ ఎంచుకొని సినిమాగా మలిచా..

*గూగుల్ లో కూడా లేవు

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గురించి డీటెయిల్ గా తెలుసుకుందామంటే గూగుల్ లో కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ గూగుల్ బుక్స్ లో కాస్త ఇన్ఫర్మేషన్ దొరికింది. అలా కొన్ని బుక్స్ చదివి ఇంకాస్త రీసెర్చ్ చేసి ఫైనల్ గా ఆయన గురించి సినిమా తీయడానికి కావాల్సిన అంశాలన్నీ తెలుసుకున్నా.

*వాళ్ళకి కాస్త తెలిసి ఉంటుంది

ఒక కాలానికే ఆయన పేరు పెట్టిన ఒక భారతదేశ రాజు అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ కాస్త హిస్టరీ మీద అవగాహన ఉన్న వ్యక్తులకు, గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్లకి మాత్రం కాస్త తెలిసి ఉంటుంది. అందుకే మొట్టమొదటిసారిగా నాణెంపై ముద్ర వేసుకున్న  ఆ మహారాజు గురించి మన తెలుగు జాతి కి తెలియజేయాలని ఫిక్స్ అయ్యా.

krish-41

*వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు 

కంచె తర్వాత వరుణ్ తేజ్ తోనే మళ్ళీ ఓ సినిమా చేయాలనుకున్నాం. కానీ ఆ సినిమా కుదరలేదు. ఇక అప్పుడే ఈ కథ తో షూటింగ్ డేట్స్ కూడా ప్లాన్ చేసుకొని బాలకృష్ణ గారిని కలిశాను. ఆయన కూడా 100 వ సినిమా స్పెషల్ గా ఉండాలని భావిస్తుండడం ఈ కథ ఆయనకి నచ్చడం వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం స్పీడ్ గా జరిగిపోయాయి.

*కథే అందరినీ ఎంచుకుంది

ఈ సినిమా విషయంలో నేను బలంగా నమ్మింది కథ. నన్ను  దర్శకుడిగా ఎంచుకోవడంతో పాటు పర్ఫెక్ట్ హీరో బాలకృష్ణతో పాటు అందరినీ ఒక్కొక్కరిగా ఎంచుకుంటూ ముందుకు నడిపించింది ఈ కథే. ఒక్కోసారి అదంతా గుర్తొస్తే మిరాకల్ అనిపిస్తుంది కూడా.

*డేట్ ముందే డిసైడ్ అయిపోయాం

సినిమా స్టార్ట్ చేసినప్పవుడే ఓ పక్కా ప్లాన్ తో ముందుకెళ్లాం. ప్రీ ప్రొడక్షన్ టైం లోనే సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాం. అలా ఫిక్స్ అయి పక్కా ప్లానింగ్ తో టీం ఎఫెర్ట్ తో సినిమాను ఫినిష్ చేశాం.

krish-60

*ఆ సీన్ చూసి షాక్ అయ్యాం…

ఈ సినిమా స్టార్టింగ్ నుంచీ ఎండింగ్ వరకు బాలకృష్ణ గారి ఎఫెర్ట్ మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా ఒక సీన్ లో గుర్రంపై పిల్లాడిని ఎత్తుకొని స్వారీ చేయాలి. ఆ సీన్ లో గుర్రం కాస్త ఎడమ వైపుకు తిరగడంతో కాస్త గందర గోళం అయింది. ఆ గుర్రం వెనుక వచ్చిన చాలా గుర్రాలు వరుసగా స్పీడ్ తో వస్తున్నాయి. వెంటనే అక్కడి స్టంట్ మాస్టర్ తన గుర్రాన్ని అడ్డం తిప్పి అన్నీ గుర్రాలను కంట్రోల్ చేశారు. దీంతో బాాలయ్య కాస్త రెస్ట్ తీసుకుంటారని అనుకున్నాం. కానీ వెంటనే సెట్ లోకొచ్చి నెక్స్ట్ సీన్ ఏంటి అనగానే బాలయ్య గారిని చూసి ఒక్కసారి షాక్ అయ్యాం. నటుడిగా ఆయనకున్న డెడికేషన్ చూసి సంతోషం వేసింది. నిజంగా చెప్పాలంటే ఈ పవర్ ఫుల్ క్యారెక్టర్ కి ఆయనే పర్ఫెక్ట్.

 

*ఎన్నో అద్భుతాలు 

ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ పూర్తయ్యే వరకూ ఎన్నో అద్భుతాలు జరిగాయి. జార్జియాలో వర్షం పడే సీన్స్ కావాలనుకొని వాటర్ ట్యాంకర్లు తెప్పిస్తే సరిగ్గా అదే టైం లో వర్షం పడేది. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. నిజంగా ఓ శక్తి మమ్మల్ని నడిపించిందని భావిస్తున్నా..

*అది కూడా కలిసొచ్చింది

ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యింది. చిరంతన్ భట్ ఈ కథ కు సరిపడే అద్భుతమైన పాటలు అందించారు. రిలీజ్ కి ముందే పాటలు మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా ‘ఎకి మీడా’ పాటకు గొప్ప రెస్పాన్స్ వస్తోంది.

*కథ చెప్పగానే ఒప్పుకున్నారు

హేమమాలిని గారిని కలిసి కథ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తెలుగు రాకపోయిన కాస్త పది డైలాగ్స్ ను మేనేజ్ చేస్తూ ఆమె ఈ సినిమాలో నటించారు. ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో మళ్ళీ ఆమె మన తెలుగు ఆడియన్స్ మెస్మరైజ్ చేయబోతున్నారు .

krish-81

*బాలకృష్ణ గారే సలహా ఇచ్చారు

ఈ సినిమాలోని ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ కి శివరాజ్ కుమార్ ను ఎంచుకున్నాం. ముందు ఈ క్యారెక్టర్ కి ఎవరైతే బాగుంటుందా? అని వెయిట్ చేశాం. అప్పుడు బాలకృష్ణ గారు శివరాజ్ కుమార్ ను తీసుకుందాం అని సలహా ఇచ్చారు. నిజంగా ఆ క్యారెక్టర్ కి ఆయన సరిగ్గా సూట్ అయ్యారు. షూటింగ్ టైం లో ఆయనతో మరో సినిమా చేయాలనిపించింది..

 

*అందుకే ఇంత త్వరగా ఫినిష్ చేశాం

ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ లోనే అన్ని జాగ్రత్తలు తీసుకొని లొకేషన్స్, బడ్జెట్, ఎక్కడ ఎన్ని సీన్స్ తీయాలి అని డిసైడ్ అయిపోయాకే బాలకృష్ణ గారిని కలిశాం. ఆయన కూడా తన సహకారం అందించి సంక్రాంతికి రావడానికి ముఖ్య కారణమయ్యారు

*రాజమౌళి రెండు సలహాలిచ్చారు

ఇక ఈ సినిమా కథ రాజమౌళి గారికి చెప్పగానే బాగుంది క్రిష్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావ్? అన్నారు. ఆల్మోస్ట్ అన్ని కథలు ఆయనికి చెప్తుంటా. ఈ సినిమాను త్వరలోనే స్టార్ట్ చేసి జనవరి 12 కి రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాం అని చెప్పగానే ఆయన రెండు సలహాలు ఇచ్చారు. అందులో ఒకటి గ్రాఫిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మాగ్జిమమ్ రియల్ సీన్స్ తీయమనడంతో పాటు రెండో సలహాగా రిలీజ్ వరకూ నువ్వు పడుకోకు ఈ సినిమాకు వర్క్ చేసే ఎవ్వరినీ పడుకోనివ్వకూ నిద్ర పోతున్నప్పటికీ లేచి ఎప్పటికప్పుడు వర్క్ కనుక్కుంటూ ఉండూ అని చెప్పారు. ఆ రెండు సలహాలు నాకు చాలా పనికొచ్చాయి. ఇంతత్వరగా రిలీజ్ కి రావడానికి ఆయన కూడా ఒక కారణమే. ట్రైలర్ చూసి మొదట ఫోన్ చేసి మెచ్చుకుంది కూడా ఆయనే.

krish-86

*బాహుబలితో ఈ సినిమాకు కంపేరిజన్

నిజం చెప్పాలంటే అందరు ఈ సినిమాను బాహుబలి తో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. ‘బాహుబలి’ అందరు చూడాల్సిన సినిమా. రాజమౌళి గారు ఆ కథను అద్భుతంగా తెరకెక్కించారు. కానీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఓ చరిత్రతో తెరకెక్కిన సినిమా. కేవలం మన తెలుగుజాతికి ఈ కథ తెలియాలనే ఫీలయ్యాం. అందుకే బాహుబలి లాగా అదర్ లాంగ్వేజ్ లో రిలీజ్ కు ప్లాన్ చేయలేదు. ఇతర భాషల వారి కోసం సబ్ టైటిల్స్ వేశాం.

*ఖబడ్దార్ అనడానికి కారణం

రీసెంట్ గా ఆడియో వేదికపై ఖబడ్ధార్ అనే పదం వాడాను. ఓ తెలుగు జాతి గర్వపడే ప్రతిష్టాత్మక సినిమా తీశానని తెలుగు వారందరు తెలుసుకోబోతున్న ఓ తెలుగు మహారాజు గురించి చూపించబోతున్నానని ఓ తెలుగు వాడిగా ఆనందంతో ఆ పదం వాడాను. దానికి కొందరు పెడార్థాలు తీశారు. అది కరెక్ట్ కాదు. నేను ఆ మాట వాడడానికి అదే కారణం తప్ప మరేం లేదు.

*హద్దులు ఉంటే మంచిది

సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు చూస్తుంటే అభిమానం హద్దులు దాటుతుందనిపిస్తుంది. చిరంజీవి గారి , బాలయ్య గారి గురించి ఏ మాత్రం తెలియని కొంతమంది 25 ఏళ్ల లోపు యంగ్ స్టర్స్ ఏవేవో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇద్దరివీ 100 , 150 రెండు ప్రతిష్టాత్మక సినిమాలు. రెండు సినిమాలతో పాటు మిగతా సినిమాలు కూడా ఘన విజయాలు సాంధించాలని కోరుకోవాలి. అభిమానం ఉండాలి కానీ హద్దులు దాటకూడదని నా ఫీలింగ్.