క్రిష్ దర్శకత్వం లో 'మణికర్ణిక'...

Sunday,April 16,2017 - 10:00 by Z_CLU

లేటెస్ట్ గా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తో సంక్రాంతి బరిలో గ్రాండ్ హిట్ సాధించిన దర్శకుడు క్రిష్ త్వరలోనే  తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు. జాన్సీ లక్ష్మి భాయ్ కథ తో కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో బాలీవుడ్ లో ఓ  హిస్టారికల్ సినిమాను ప్లాన్ చేసుకున్న క్రిష్ ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయిపోయాడు.

ఇక మొన్నటి వరకూ జాన్సీ లక్ష్మి భాయ్ పాత్రకు కంగనా ఏ మేరకు సూట్ అవుతుందో అనుకున్న అందరికీ సోషల్ మీడియా లో ఓ ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ క్లారిటీ ఇచ్చేసింది.. ప్రెజెంట్ ఈ ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మరి అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి స్టేజి లో ఉన్న ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఇప్పటికే ఈ సినిమాకోసం ‘మణి కర్ణిక’ అనే టైటిల్ కూడా మేకర్స్ ఫిక్స్ చేసారని సమాచారం.మరి ఇప్పటికే బాలీవుడ్ లో ఓ సినిమాను డైరెక్ట్ చేసిన క్రిష్ ఈ సినిమాతో అక్కడ ఎలాంటి జిత్ సాదిస్తాడో..చూడాలి.