పోస్టర్ తో మెసేజ్ ఇచ్చిన రవితేజ

Thursday,April 02,2020 - 12:22 by Z_CLU

ప్రస్తుతం కరోనా పరిస్థితుల ప్రభావంతో ఇళ్ళ నుండి ఎవరు బయటికి రాలేని పరిస్థితి. ఇక స్టార్స్ కూడా ఎప్పటికప్పుడు అందరూ ఇంట్లోనే ఉండాలంటూ సందేశాలిస్తున్నారు. తాజాగా మాస్ మహారాజ రవితేజ కూడా తన అప్ కమింగ్ సినిమా ‘క్రాక్’ పోస్టర్ ద్వారా ప్రజలకు #StayHome సందేశమిచ్చాడు.

శ్రీరామనవమి సందర్భంగా ‘క్రాక్’ సినిమాకు సంబంధించి ఓ ఫ్యామిలీ పోస్టర్ వదిలారు. పోస్టర్ లో శృతి హాసన్ తో పాటు పిల్లాడిని ఎత్తుకొని కనిపిస్తూ “Stay at home n enjoy with ur Family” అంటూ ఇళ్ళ నుండి కాలు కదపకుండా కరోనాను ఎదుర్కోవాలని మెసేజ్ అందించాడు మాస్ రాజా.


ఈ పోస్టర్ తో సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉందని తెలియజేశారు. ఠాగూర్ మధు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.