మహాశివరాత్రి స్పెషల్.. క్రాక్ టీజర్ రిలీజ్

Friday,February 21,2020 - 07:16 by Z_CLU

మహాశివరాత్రి సంద‌ర్భంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శృతి హాస‌న్‌ కాంబినేష‌న్‌లో వస్తున్న `క్రాక్` సినిమా టీజర్ విడుద‌లైంది. టీజర్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు రవితేజ. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుందనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది.

ఒంగోల్ లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే..అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా..అంటూ తనదైన మ్యానరిజం తో రవితేజ చెప్పే డైలాగ్ టీజర్ లో ఉంది.

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోంది ఈ సినిమా. డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే 8న విడుదల చేయబోతున్నారు.

న‌టీన‌టులు:
ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, సుమ‌ద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, పూజిత పొన్నాడ‌, హ్యాపీడేస్ సుధాక‌ర్‌, వంశీ చాగంటి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌: బి.మ‌ధు
బ్యాన‌ర్‌: స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె.విష్ణు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
ఫైట్స్‌: రామ్ ల‌క్ష్మ‌ణ్‌