కౌసల్య కృష్ణమూర్తి టీజర్ రివ్యూ

Tuesday,June 18,2019 - 06:04 by Z_CLU

ఐశ్వర్య రాజేష్‌, డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా కౌసల్య కృష్ణమూర్తి. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈరోజు టీజర్ ను లాంఛ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ టీజర్ లాంఛ్ అయింది.

క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది కౌసల్య కృష్ణమూర్తి సినిమా. ఇప్పుడున్న యూత్‌కి కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ఎనర్జిటిక్‌గా ఉంటూనే మంచి ఎమోషనల్‌గా ఉండే ఒక రైతు కుటుంబానికి సంబంధించిన కథ. ప్యారలల్‌గా ఒక క్రికెటర్‌, రైతు కథ. ఈ ఎలిమెంట్స్ అన్నీ టీజర్ లో కనిపించాయి. అందుకే ఈ టైటిల్ కు ది క్రికెటర్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్ పై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు. దిబు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.