Kothi kommachi - ఎట్రాక్ట్ చేస్తున్న థీమ్ సాంగ్

Friday,April 23,2021 - 01:23 by Z_CLU

మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్ గా జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోతి కొమ్మచ్చి’ సినిమా నుండి థీం సాంగ్ రిలీజ్ అయింది. అనూప్ రుబెన్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని 2D యానిమేషన్ వీడియో రూపంలో విడుదల చేశారు.

ఈ సాంగ్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేసి టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘కో కో కో కోతి కొమ్మచ్చి’ అంటూ లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది.

ముఖ్యంగా ఈ సాంగ్ ని 2D యానిమేషన్ లో డిజైన్ చేసి రిలీజ్ చేయడంతో అందరినీ ఆకర్షిస్తుంది. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ తో పాటు సింగింగ్ సాంగ్ కి అందం తీసుకొచ్చింది. ఇక శ్రీమణి క్యాచీ లిరిక్స్ కూడా థీమ్ సాంగ్ కి ప్లస్ అయ్యాయి. సినిమాలో ఓ మంచి సందర్భంలో వచ్చే ఈ పాట థియేటర్ లో ఇంకా అలరిస్తుందని ఈ సాంగ్ లో ఆర్టిస్టులందరూ ఉంటారని యూనిట్ చెప్తోంది.

రాజేంద్ర ప్రసాద్, VK నరేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అన్నపూర్ణమ్మ , సిజ్జు, రాజశ్రీ నాయర్, ప్రవీణ్ , సుదర్శన్ , రచ్చ రవి ముఖ్య పాత్రలు పోషించారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. సినిమాలో లవ్ ట్రాక్ తో పాటు కామెడీ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని టీం చెప్తున్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics