KothiKommachi - షూటింగ్ అప్డేట్

Monday,November 23,2020 - 11:52 by Z_CLU

శతమానంభవతి సినిమాకు గానూ నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న లు హీరోలుగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘కోతి కొమ్మచ్చి’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇటీవలే అమలాపురంలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్, సాంగ్స్ కూడా షూట్ చేసిన యూనిట్ ప్రస్తుతం వైజాగ్ లో హీరోలు మేఘాంశ్ , సమీర్ హీరోయిన్స్ రిద్ది కుమార్, మేఘా చౌదరి లపై సన్నివేశాలు తీస్తున్నారు.

సింగిల్ షెడ్యూల్ లో ఒక సాంగ్ మినహా టోటల్ షూట్ పూర్తి చేయబోతున్నారు. అందుకే ఎలాంటి బ్రేక్ లేకుండా షూట్ చేస్తున్నారు. అమలాపురంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ బాగా ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై MLV సత్యానారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.