మరో మెగా హీరోతో కొరటాల ఫిక్స్ ?

Sunday,August 13,2017 - 11:05 by Z_CLU

అతి తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన కొరటాల శివ పక్క ప్లానింగ్ తో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం మహేష్ తో మరో సారి ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్న కొరటాల ఈ సినిమా పూర్తవ్వగానే మెగా హీరో రామ్ చరణ్ తో ఓ సినిమాను ఎన్టీఆర్ తో మరో  సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాల తర్వాత మెగా హీరో అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట ఈ స్టార్ డైరెక్టర్.

ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతున్న కొరటాల ఇటీవలే బన్నీకి ఓ పాయింట్ వినిపించాడని బన్నీ కి ఈ పాయింట్ నచ్చిందని, త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందని వార్త వినిపిస్తుంది. సో ఇప్పటికే ముగ్గురు స్టార్ లతో సినిమాలు సెట్ చేసుకున్న కొరటాల మరో స్టార్ హీరో ని కూడా లైన్ లో పెట్టేశాడన్నమాట..