ఈసారి ఆ అదృష్టవంతుడు ఎవరో?

Wednesday,April 22,2020 - 02:07 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ ను పెర్ ఫెక్ట్ గా ఉపయోగించుకుంటున్నాడు దర్శకుడు కొరటాల. తన వద్ద ఆల్రెడీ ఉన్న ఐడియాస్ ను స్టోరీ రూపంలో మార్చే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా ఎప్పట్నుంచో అనుకుంటున్న ఓ స్టోరీలైన్ ను స్క్రిప్ట్ గా మలిచాడు ఈ దర్శకుడు.

లెక్క ప్రకారం కొరటాల తన నెక్ట్స్ మూవీని ఎన్టీఆర్ తో చేయాలి. కానీ ఆచార్య థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఏ హీరో అందుబాటులో ఉంటే ఆ హీరోతో సెట్స్ పైకి వెళ్తానని ఈ దర్శకుడు ఆల్రెడీ ప్రకటించాడు. భరత్ అనే నేను తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

సో.. ప్రస్తుతానికైతే కొరటాల సైడ్ నుంచి అంతా క్లియర్ గా ఉంది. ఆచార్య రిలీజైన 3 నెలల్లోగా సెట్స్ పైకి వెళ్లిపోవాలనేది ఈ డైరక్టర్ ప్లాన్. మరి అప్పటికి ఏ హీరో అందుబాటులోకి వస్తాడో, ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలి.