మహేష్ తో మరో సినిమాకు అదే కారణం?

Thursday,July 21,2016 - 05:45 by Z_CLU

కేవలం రెండు సినిమాలతోనే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో రెండో స్థానం అందుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. ‘మిర్చి’ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ రచయిత తొలి సినిమాతో నే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత మరో మంచి ఎమోషనల్ మూవీతో, సరికొత్త పాయింట్ తో మహేష్ బాబు తో ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని రూపొందించి దర్శకుడిగా టాప్-2 స్థాన్నాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు ఎన్.టి.ఆర్ తో రూపొందిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రీకరణ రెండు పాటల మినహా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉన్న ఈ సినిమా తరువాత కొరటాల మరో సారి మహేష్ తో ఓ సినిమాను ప్లాం చేసుకుంటున్నాడట.

‘శ్రీమంతుడు’ రూపంలో తన కెరీర్ లో గొప్ప సినిమాను అందించడంతో ఇటీవలే ఈ దర్శకుడు చెప్పిన పాయింట్ కి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట మహేష్. అయితే కొరటాల ‘జనతా గ్యారేజ్’ తరువాత రామ్ చరణ్ తో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ ‘ధ్రువ’ ఇంకా చిత్రీకరణ దశలో ఉండడం… ఆ వెంటనే సుకుమార్ సినిమా కు చెర్రీ రెడీ అవుతుండడంతో…. మహేష్ తో మరోసారి సెట్స్ పైకి వెళ్లేందుకు కొరటల ప్లాన్ చేసుకుంటున్నాడట. ‘జనతా గ్యారేజ్’ విడుదల అవ్వగానే మహేష్ కోసం పూర్తి కథ ను సిద్ధం చేయనున్నాడట కోరటాల. మరి ఈ సినిమాకు తను చేయబోతున్న మురుగదాస్ ప్రాజెక్ట్ తో పాటు సైమల్టేనియస్ గా మహేష్ హ్యాండిల్ చేస్తాడా… లేక మురగదాస్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కొరటాల సినిమా సెట్స్ పైకి వస్తుందా అనేది వేచి చూడాలి.