ఎన్టీఆర్- చరణ్ తో కొరటాల ఫిక్స్... ముందెవరితో ?

Sunday,September 24,2017 - 12:06 by Z_CLU

ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్న కొరటాల శివ ఈ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత ఇద్దరు స్టార్ హీరోలతో నెక్స్ట్ సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం మహేష్ తర్వాత కొరటాల ఎవరితో ముందు సినిమా చేస్తాడా..అనే క్యూరియాసిటీ నెలకొంటుంది.

ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ సినిమాను తెరకెక్కించిన కొరటాల తారక్ తో మరో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు ఈ స్టార్ డైరెక్టర్.. అయితే వీరిద్దరిలో ముందుగా ఏ హీరోతో కొరటాల నెక్స్ట్ సినిమా ఉంటుందా.. అనే ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. మరి ఈ ఇద్దరిలో కొరటాల ఏ హీరోతో ముందుగా సినిమా చేస్తాడో.. తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.