మరో రెండేళ్లు మెగా కాంపౌండ్ లోనే..!

Tuesday,May 28,2019 - 12:17 by Z_CLU

లెక్కప్రకారం.. రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రావాలి. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సహ-నిర్మాతగా కూడా ఫిక్స్ అయింది. కానీ ఆ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టాడు చరణ్. కొరటాలకు ఏకంగా చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు.

అలా చిరంజీవిని డైరక్ట్ చేసే అవకాశం అందుకున్న కొరటాల, ఇప్పుడు పనిలోపనిగా చరణ్ ను కూడా లైన్లో పెట్టాడు. గతంలో చరణ్ తో ప్రకటించిన సినిమానే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చేయబోతున్నాడు

ప్రస్తుతం ఆర్-ఆర్-ఆర్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు చరణ్. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో చిరంజీవితో సినిమా పూర్తిచేస్తాడు కొరటాల.