మహేష్ బాబు సినిమా కోసం భారీ సెట్

Monday,July 22,2019 - 03:18 by Z_CLU

ఒక్కడు సినిమా కోసం కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేశాడు మహేష్. మళ్లీ ఇన్నేళ్లకు అదే లొకేషన్ లో షూటింగ్ చేయాల్సి వచ్చింది. స్టోరీలైన్ ప్రకారం, సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం కొండారెడ్డి బురుజు వద్ద కొన్ని సీన్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

 

ఒక్కడు టైమ్ కు మహేష్ బాబు ప్రిన్స్ మాత్రమే. కానీ ఇప్పుడు అతడు సూపర్ స్టార్. అలాంటి లొకేషన్ లో మహేష్ తో షూటింగ్ అంటే అసాధ్యం. అందుకే ఏకంగా కొండారెడ్డి బురుజు సెట్ వేస్తున్నారు. అవును.. మహేష్ కొత్త సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ఈ సెట్ రూపుదిద్దుకుంటోంది. మహేష్-రష్మికపై ఈ సెట్ లో కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు.

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. రెండో షెడ్యూల్ ను ఈనెల 26 నుంచి అన్నపూర్ణలో ప్లాన్ చేశారు. అప్పటికే రామోజీ ఫిలింసిటీలో సెట్ కంప్లీట్ అయితే సెకెండ్ షెడ్యూల్ లోనే ఈ సన్నివేశాల్ని కూడా తెరకెక్కిస్తారు. లేదంటే కొండారెడ్డి బురుజు ఎపిసోడ్, మూడో షెడ్యూల్ కు షిఫ్ట్ అవుతుంది.

సినిమాలో ఒక షేడ్ లో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్నాడు మహేష్. విజయశాంతి, బండ్ల గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.