Kobbari Matta దర్శకుడి నుండి మరో కామెడీ సినిమా

Wednesday,October 21,2020 - 01:02 by Z_CLU

Sampoornesh హీరోగా తెరకెక్కిన ‘Kobbari Matta’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన Rupak RonaldSon మరో కామెడీ సినిమాతో రాబోతున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘పలాస 1978’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు అందుకున్న Thiruveer ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. తెలంగాణాలోని సింగరేణి నేపథ్యంలో కామెడీ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు రూపక్.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. యశ్వంత్ నాగ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. Walter Production బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ సినిమాకు పరేషాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు.