కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ఫిక్సయింది

Monday,January 08,2018 - 10:51 by Z_CLU

కళ్యాణ్ రామ్ తమన్నా జంటగా నటిస్తున్న మూవీ టైటిల్ ఫిక్సయింది. అల్టిమేట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘నా నువ్వే’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది సినిమా యూనిట్. టైటిల్ తో పాటు రివీల్ అయిన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్జ్, మూవీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

‘లవ్..లవ్.. లవ్.. యస్, ఇప్పుడు మనం దీని గురించే మాట్లాడబోతున్నాం’ అంటూ బిగిన్ అయ్యే ఈ ఫస్ట్ గ్లింప్జ్, ఈ సినిమా పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని కన్ఫం చేస్తుంది. బాహుబలి తరవాత తమన్నా చేస్తున్న ఇమ్మీడియట్ సినిమా కావడం, అందునా కళ్యాణ్ రామ్, తమన్నా ఫస్ట్ టైమ్ జోడీ కడుతుండటంతో  ఆ ఫ్రెష్ లుక్ స్క్రీన్ పై అదుర్స్ అనిపిస్తుంది.

ఈ ఫస్ట్ గ్లింప్జ్ లో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ కాకపోయినా, ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేయడంలో సక్సెస్ అయింది. జయేంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.