షూటింగ్ పూర్తిచేసుకున్న కళ్యాణ్ రామ్ మూవీ

Saturday,February 10,2018 - 12:06 by Z_CLU

కంప్లీట్ మేకోవర్ తో కల్యాణ్ రామ్ చేస్తున్న సినిమా నా నువ్వే. ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ మినహా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. మూవీకి సంబంధించి ఓ సాంగ్ ను రీసెంట్ గా అన్నపూర్ణ స్టుడియోస్ లో షూట్ చేశారు. బృంద కొరియోగ్రఫీలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తీశారు.

నా నువ్వే సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ తో పాటు అఫీషియల్ గా మూవీ ప్రమోషన్ ప్రారంభించబోతున్నారు.

కూల్ బ్రీజ్ సినిమాస్ బ్యానర్ పై, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. శరత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.