"గరుడు వెగ"లో జార్జ్ గా కిషోర్

Saturday,May 20,2017 - 11:45 by Z_CLU

డా.రాజ‌శేఖ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ “పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M“. పూజా కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోన్ ఐటెంసాంగ్ చేసింది. జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్ భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కిషోర్ ను తీసుకున్నారు. ఈ పాత్ర పేరు జార్జ్.

కబాలి, చీకటి రాజ్యం వంటి సినిమాలతో పేరుతెచ్చుకున్నాడు జార్జ్. రాక్షసుడికి మానవ రూపంగా జార్జ్ పాత్ర ఉంటుందని అంటోంది యూనిట్. ఈ పాత్ర కిషోర్ కు మంచి పేరు తీసుకొస్తుందని అంటోంది. త్వరలోనే సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు.