Kiran Abbavaram - మరో సినిమా స్టార్ట్ చేసిన యంగ్ హీరో

Saturday,October 09,2021 - 08:14 by Z_CLU

Kiran Abbavaram’s 5th Project To Be Produced By Kodi Divyaa Launched

లెజెండరీ డైరెక్టర్ కోడిరామకృష్ణ గారి కుమార్తె కోడి దివ్య దీప్తి  తన తండ్రి ఇన్స్పిరేషన్ తో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోడి రామకృష్ణ  ప్రెజెంట్స్ లో  కోడి దివ్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), సంజన ఆనంద్ జంటగా కార్తీక్ శంకర్ దర్శకత్వంలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు, నిర్మాతలు అల్లు అరవింద్, మురళి మోహన్, దర్శక, నిర్మాతలు యస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, రాజా రవీంద్ర తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ ను బ్లెస్స్ చేశారు.  Kodi Divya Entertainments kiran abbavaram movie

ఈ చిత్రం తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్ లపై నిర్మాత రామలింగేశ్వర రావు క్లాప్ నివ్వగా,ప్రముఖ దర్శకుడు ఏ.యమ్ రత్నం స్విచ్ ఆన్ చేశారు, లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు.

కిరణ్ అబ్బవరంకు కెరీర్ లో ఇది ఐదో సినిమా. కార్తీక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics