Kiran Abbavaram - యంగ్ హీరో నుంచి మరో మూవీ
Tuesday,January 05,2021 - 11:02 by Z_CLU
‘రాజావారు రాణివారు’ సినిమాతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్‌కు ‘సమ్మతమే’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
‘కలర్ ఫొటో’లో హీరోయిన్గా తన క్యూట్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించిన చాందిని చౌదరి ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం జోడీగా నటిస్తున్నారు. యు.జి. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లవ్ డ్రామా మేళవించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా, సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. విప్లవ్ నైషదం ఎడిటర్ కాగా, సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు తర్వాత SR కల్యాణమండపం సినిమా చేస్తున్న ఈ హీరో, సైమల్టేనియస్ గా సెబాస్టియన్ అనే మరో మూవీని కూడా పూర్తిచేస్తున్నాడు. ఇప్పుడు సమ్మతమే అనే మరో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు.