కియరా Vs రష్మిక... ఎవరికి ఛాన్స్?

Friday,February 08,2019 - 06:49 by Z_CLU

ఓవైపు కియరా అద్వానీ.. మరోవైపు రష్మిక..
క్రేజీ కాంబినేషన్ లో సినిమా.. మరి ఆ అదృష్టం ఎవర్ని వరిస్తుంది?
ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్ లో నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? బన్నీ-త్రివిక్రమ్ మూవీలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టు.

గీతా ఆర్ట్స్, హారిక-హాసిని బ్యానర్లపై జాయింట్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా పేర్లు పరిశీలించారు. ఫైనల్ గా కియరా అద్వానీ, రష్మిక రేసులో నిలిచారు. వీళ్లలో ఎవర్ని సెలక్ట్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది ఈ సినిమా. ముందుగా రీమేక్ అనుకొని డ్రాప్ అయ్యారు. తర్వాత మరో ఫ్రెష్ స్టోరీని డెవలప్ చేస్తున్నారు. అందుకే కాస్త టైమ్ పడుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ నుంచి మూవీ సెట్స్ పైకి వస్తుంది. ఈలోగా హీరోయిన్ పై ఓ క్లారిటీ వస్తుంది.