కైరా అద్వానీ చేయాలనుకుంటున్న బయోపిక్

Friday,January 11,2019 - 04:11 by Z_CLU

‘భరత్ అనే నేను’ తో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ, ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోయిన్ హోదాని దక్కించుకుంది. అయితే రీసెంట్ గా ‘వినయ విధేయ రామ’ ప్రమోషన్స్ లో భాగంగా తన మనసులో మాట బయటపెట్టిందీ ముద్దుగుమ్మ. తనకు సీనియర్ బాలీవుడ్ నటి ‘మధుబాల’ బయోపిక్ లో నటించాలనుందని చెప్పుకుంది.

కరియర్ ప్లానింగ్స్ గురించి ప్రస్తావిస్తే జస్ట్ నేటివ్ ఆడియెన్స్ కే కాదు గ్లోబల్ ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేసే స్థాయికి రావడమే టార్గెట్ అని చెప్పుకునే కైరా, ‘మధుబాల’ బయోపిక్ స్క్రిప్ట్ తో ఎవరు వచ్చి అడిగినా, ఇమ్మీడియట్ గా యస్ చెప్పేస్తాను అని చెప్పింది.

టాలీవుడ్ , బాలీవుడ్ అని తేడా లేకుండా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ కరియర్ ప్లాన్ చేసుకుంటున్న కైరా, ఫ్యూచర్ లో ‘మధుబాల’ గా కనువిందు చేసే చాన్సెస్ ఉన్నట్టే అనిపిస్తుంది.