కైరా అద్వానీ ఇంటర్వ్యూ

Friday,January 04,2019 - 01:17 by Z_CLU

జస్ట్ ‘వినయ విధేయ రామ’ సినిమా గురించే కాదు. చెర్రీ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడింది కైరా అద్వానీ. ప్రస్తుతం VVR ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో తన మనసులో మాటలు చెప్పుకుంది. అవి మీకోసం…

డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్…

నా కరియర్ లో ఇంత పెద్ద సినిమా ఎప్పుడూ చేయలేదు. 15 మంది టాప్ యాక్టర్స్ తో నటించడం అనేది అమేజింగ్ ఎక్స్ పీరియన్స్. సెట్స్ దగ్గరి నుండి ప్రతీది లార్జర్ దెన్ లైఫ్ అనిపించింది.

అదీ చాలా  కష్టం…

న్యాచురల్ ఎలిమెంట్స్ ని ప్రెజెంట్ చేయడం వేరు. ఏదైతే నమ్మడానికి వీల్లేకుండా ఉంటాయో, వాటిని నమ్మేంతగా.. ఫీలయ్యేంతగా మెస్మరైజ్ చేస్తూ స్క్రీన్ పై ఎలివేట్ చేయడం చాలా కష్టం. అది బోయపాటి లాంటి ఫిల్మ్ మేకర్స్ కే సాధ్యమవుతుంది.

అందుకే నటినయ్యా…

నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నటినయ్యా. కంప్లీట్ గా అటు డ్యాన్స్, కామెడీ… పర్ఫామ్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న సినిమాలో పని చేసే అవకాశం దొరికినప్పుడు చాలా హ్యాప్పీగా ఉంటుంది. ‘వినయ విధేయ రామ’ చేసినందుకు కూడా అదే ఫీలింగ్.

ఇంట్రెస్టింగ్ కెమిస్ట్రీ…

సినిమాలో మా కెమిస్ట్రీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా క్యారెక్టర్ వచ్చేసి ‘సీత’. ఫ్యామిలీ లో అందరి ముందు చాలా వినయంగా ఉంటూ, రామ్  ఏది చెప్తే అదీ అన్నట్టుగా ఉంటాను. బయట మాత్రం చాలా డామినేటింగ్ గా ఉంటాను. మా కాంబినేషన్ లో ఉండే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.

అందుకే ఈ సినిమాలో చేశా…

బోయపాటి గారు ఈ సినిమా స్టోరీ న్యారేట్ చేసినపుడే సినిమా చూసేశాననే ఫీలింగ్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ స్టోరీ విన్నాననిపించింది. అందుకే ఇమ్మీడియట్ గా ఓకె అని  చెప్పేశా…

క్వాలిటీ టైమ్ ని నమ్ముతా…

సినిమాలో నేను ఎంత టైమ్ స్క్రీన్ పై కనిపిస్తాను అనేకన్నా, కనిపించినంత సేపు నేను ప్లే చేసిన క్యారెక్టర్ కి క్వాలిటీ ఉందా లేదా..? నా ప్రెజెన్స్  ని ఆడియెన్స్ ఫీల్ అయ్యారా లేదా అని ఆలోచిస్తా.

చాలా హ్యాప్పీగా అనిపించింది…

బేసిగ్గా డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి చరణ్ లాంటి డ్యాన్సర్ తో స్టెప్స్ వేస్తూ, చాలా ఎంజాయ్ చేశా. నాకు ‘రామా లవ్స్ సీత’ ఇప్పటి వరకు నేను చేసిన సాంగ్స్ లో మోస్ట్ ఫేవరేట్. 800 మంది డ్యాన్సర్స్ తో  చాలా గ్రాండ్ గా పిక్చరైజ్ చేశారు ఆ పాటని.

నేనైతే అదే నమ్ముతా…

నాకైతే  పర్టికులర్  గా ఒకే లాంగ్వేజ్ ఆడియెన్స్ కి స్టిక్ అవ్వాలనే ఆలోచన లేదు. గ్లోబల్ ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయాలి. లాంగ్వేజ్ ఏదైనా, స్క్రిప్ట్ బావుంటే అది డిజిటల్ ప్లాట్ ఫామ్ అయినా ‘నో’ అని చెప్పను.

‘భరత్ అనే నేను’ సినిమాకి ముందు…

‘భరత్ అనే నేను’ సినిమాకి ముందు నమ్రతా నన్ను వేరే సినిమాలకోసం అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ అప్పుడు డేట్స్ అర్జెస్ట్ అవ్వకపోవడం వల్ల కుదరలేదు. ఎప్పుడైతే ‘భరత్ అనే నేను’ ఆఫర్ వచ్చిందో ఎలాగైనా చేసేయాలనుకున్నా…

అర్జున్ రెడ్డి రీమేక్…

అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. సినిమాలో లాస్ట్ సీన్ నుండి షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమాలో నేటివిటీకి తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్ చేశారు. సినిమా ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.

రామ్ చరణ్ సీక్రెట్ అకౌంట్…  

రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ అంటే చాలా ఇష్టం. ఆయనకీ సీక్రెట్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. కానీ చాలా మందికి ఆ విషయం తెలీదు.